కత్తిరింపులు :

ప్రతి మొక్కకు బలంగా పెరిగిన నాలుగు కొమ్మలను కాండలుగా ఉంచి మిగిలినవి కత్తిరించాలి. 2-3 సంవత్సరాల్లో ప్రధమ, ద్వితీయ కొమ్మలను తగు రీతిగా పెంచి సరైన ఆకారం తీసుకు రావాలి. నేలకు ప్రాకే కొమ్మలు, గుబురుగా పెరిగే కొమ్మలు, నిటి కొమ్మలను కత్తిరించాలి. చెట్లకు విశ్రాంతి నిచ్చే సమయంలో చివరి కొమ్మలను 10-15 సెం.మీ. పొడువు కత్తిరించాలి. క్తిరించిన తర్వాత వచ్చిన చిగుర్లలో 2-3 ఉంచి మిగిలిన చిగురు తీసివేసినచో బలమైన కొమ్మల పై  పిందెలు ఏర్పడి కయసైజు పెరుగుతుంది. చెట్టుకు 60-80 కాయలు ఉంచి మిగతావి తీసివేయాలి.